మతోన్మాదాన్ని తిప్పి కొట్టడానికి యువత ముందుకు రావాలి

-గడ్డం వెంకటేష్ – DYFI జిల్లా కార్యదర్శి

 

నేటి యువత మతోన్మాదం పెరుగుతున్న సందర్భంలో మతోన్మాదాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సహాయ కార్యదర్శి చెన్న రాజేష్ అన్నారు. మంగళవారం స్థానిక ఏసి రెడ్డి భవనంలో బోనగిరి గణేష్ అధ్యక్షతన జరిగిన ఆలేరు పట్టణ జనరల్ బాడీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత మెదడులను మతం పేరుతో హిందుత్వం పేరుతో రెచ్చగొడుతూ యువత భవిష్యత్తును నాశనం చేయాలనే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏటా కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు భర్తీ చేసిన పరిస్థితి లేదని వారన్నారు. మూడవిశ్వాసాలను హిందుత్వ విధానాలను ఎక్కువ భాగం బిజెపి వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని దీనిని ఎదిరించడం కోసం యువత ముందుండి బిజెపి విధానాలను కొట్టాలని వారు అన్నారు. యువతకు ఉపాధి మాట పక్కన పెట్టి మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బిజెపి విధానాలను యువత ఎప్పటికప్పుడు ఎదిరించడం కోసం ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ నాయకులు వడ్డెమాను విప్లవ్, మాదాని నవీన్, మోరిగాడి మౌర్య, ఎండి అఖిల్, దండు నాగరాజు, పాశకంటి ఉదయ్, గాడిపల్లి ప్రశాంత్, విద్యార్థి సంఘం నాయకులు కందుల నాగరాజు, కత్తి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *