B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీసుకి ఆనుకొని ఉన్నటువంటి దాదాపు 2000 గజాల భూమిని గాలికి వదిలేసిన మున్సిపల్ అధికారులు. ప్రైవేటు విద్యాసంస్థ సొంత పార్కింగ్ కోసం ఆ స్థలాన్ని వాడుకుంటున్నారు.మున్సిపల్ లోని ప్రజలు ట్రాఫిక్ సమస్యతోటి నానా ఇబ్బందులు పడుతుంటే కూరగాయల మార్కెట్ మరియు చాపల మార్కెట్ కు వచ్చిన ప్రజలు వాహనాలు ఎక్కడ ఆపాలో అర్థం కాక ట్రాఫిక్ పోలీసుల చేతిలో చలాన్లకు బలవుతున్న పరిస్థితి ఏర్పడింది మున్సిపాలిటీ ఆదాయాన్ని గత ఐదు సంవత్సరాల నుండి గండికొడుతున్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని ప్రజల పార్కింగ్ కోసం ఇవ్వాల్సిందిగా డివైఎఫ్ఐ నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాహనాలు రోడ్డు మీద ఆపడం తోటి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లేటువంటి అంబులెన్స్లకు సమయానికి దారి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇకనైనా అధికారులు స్పందించకపోతే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం.
FOLLOW B6 NEWS CHANNEL