B6 NEWS
రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది:పానుగంటి పారిజాత నర్సింహ గౌడ్,సర్పంచ్
మునుగోడు(గంగోరిగూడెం):రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంటుందని గంగోరిగూడెం గ్రామ సర్పంచ్ పానుగంటి పారిజాతనర్సింహ్మ అన్నారు.ఈ రోజు గంగోరిగూడెం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని aeo నర్సింహ్మ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయం పండుగల మరింది అని అన్నారు.దళారుల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అన్నారు.గిట్టుబాటు ధర 2060 అందిస్తున్నందున ఎండబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరమల్ల ఈశ్వరయ్య,ఉయ్యాల రామకృష్ణ,ఏళ్ల కిరణ్ రెడ్డి,రైతులు శవగొని నర్సింహ,గోపాగోని సైదులు,గోపాగోని అంజయ్య,బొంత ఎల్లయ్య,గోపాగోని మల్లయ్య,బొంత వెంకటయ్య,గోపగోని స్వామి,గోపాగోని వెంకటయ్య,పల్లెగోని బుచ్చమ్మ,ఈర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL