గురువారం నాడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీర్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో పేదలకు ఇండ్లు అందించే ప్రతిష్టాత్మక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో 18,300 కోట్లతో 2 లక్షల 91 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, 18 వేల 300 కోట్ల నిధులకు గాను ఇప్పటి వరకు 12 వేల కోట్లు విడుదల చేయడం జరిగిందని, నిధుల కొరత లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు సిద్దంగా వున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాదును మినహాయించి జిల్లాలలో 62 వేల ఇండ్లు పూర్తి అయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణం తుది దశలో వున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలు ప్రకారం లబ్దిదారులు గుర్తింపు జరగాలని, గ్రామ, వార్డు సభల ద్వారా లబ్దిదారుల నుండి దరఖాస్తులు తీసుకొని తహశీలుదార్ల ద్వారా సర్వే పూర్తి చేసి పంపాలని, అర్హులైన లబ్దిదారుల దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్పులైన వారి దరఖాస్తులను వెయిటింగ్ లిస్టులో వుంచి తదుపరి మంజూరీలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని, పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్షించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, అంతర్గత పనులకు సంబంధించి త్రాగునీరు, విద్యుత్, సీవరేజీ పనులను, అలాగే తుది దశలో వున్న ఇళ్లను వెంటనే పూర్తి చేసేలా లైన్ డిపార్టుమెంట్స్ పరస్పర సమన్వయంతో యాక్షన్ ప్లానుతో ముందుకెళ్లాలని, పంపిణీకి సిద్దంగా ఉన్న ఇండ్లను మంత్రులు, శాసనసభ్యుల సమన్వయంతో అర్హులైన లబ్దిదారులకు అందించాలని తెలిపారు. పోడు భూముల సర్వే, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తదితర అంశాలపై మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సర్వే దాదాపు పూర్తయిందని, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రామాలలో గ్రామసభ నిర్వహణ పూర్తి చేయాలని, నవంబర్ 26 నాటికి పోడు భూములకు సంబంధించి క్షేత్ర స్థాయి సర్వే, గ్రామ సభలు , ఎస్.డి.ఎల్.సి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. 

వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, ఆర్.అండ్.బి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శంకరయ్య, కలెక్టరేటు సూపరింటెండెంట్ నాగలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *