ఆలేరులోని కొలనుపాక రోడ్డులో గల పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణలో ఆలేరు పట్టణంలో చెత్త సేకరించే ఆటోలను పార్కింగ్ చేసినారు. ఆటోలకు సంబంధించిన టైర్లను మరియు బ్యాటరీలను. ఆటోకు సంబంధించిన ఇతర వస్తువులను ఎవరో దొంగిలించడం జరిగినది.
ఇది జరిగి కూడా దాదాపు ఒక నెల కావస్తున్న ఇప్పటివరకు మునిసిపల్ అధికారులు గానీ.చైర్మన్ గానీ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం.
కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు దీనికి కారణం ఏంటి. ఇది ప్రజల సొమ్ము ప్రజల నుండి మనం వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో కొన్న ఆటోలు. పట్టణంలో చెత్త సేకరించే ఆటోలు మాత్రం వార్డులలోకి రోజు రావు వారానికి ఒక్కరోజు చొప్పున చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. ఇలా పార్కింగ్ లో పెట్టి ఆటోలకు సంబంధించిన విలువైన టైర్లు మరియు బ్యాటరీలను దొంగలపాలు చేసే బదులు ప్రతిరోజు ఆటోలు తిప్పితే నష్టం ఏంటి.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ మీద మరియు ఆలేరు మున్సిపల్ చైర్మన్ మీద చర్య తీసుకోగలరని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాను.