B6 NEWS
73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా BSP పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శంకరచారి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగానికి విలువ ఇచ్చి బహుజనులు అందరు ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని భారత రాజ్యాంగం అత్యున్నత మైనది అని రాజ్యాంగ పరిరక్షణ కు ప్రజల హక్కుల రక్షణ కోసం BSP పార్టీ ముందు ఉంటుంది
అని అందుకు ప్రజాలంత కలిసి రావాలని అయిన అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గణం నర్సింహ్మ కురుమ మాట్లాడుతూ 1949 నవంబర్ 26 న మన భారతదేశాన్ని. సర్వసత్తాక. సౌమ్యవాదా. లౌకిక . ప్రజాస్వామ్య.గణతంత్ర. రాజ్యాంగా.నిర్మించుకోవడం జరిగిందని అన్నారు.
అందరి తలరాతలను తరతరాల చరిత గతిని తిరుగరాసిన అతిపెద్ద లిఖిత గ్రంధం భారత రాజ్యాంగం అని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం సంపూర్ణంగా పురివిప్పిన సుదీనం భారత రాజ్యాంగ దినోత్సవం అని అన్నారు. వ్యక్తి హోదా. జాతి ఐక్యత సమగ్రతను పెంపొందించుటే రాజ్యాంగ ఉద్దేశ్యం దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో బిస్పీ నారాయణపురం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల వెంకటయ్య. బిస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె లింగస్వామి నియోజకవర్గ కార్యదర్శి కత్తుల నర్సింహ్మ ముస్కు నర్సింహ్మ ఎర్రోళ్ల గిరి తదితరులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL