B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ HDFC బ్యాంక్ మరియు స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 250 మందికి కంటి పరీక్షలు
నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేసి చూపు తగ్గిన వారికి కళ్ళజోలను రాయితీ రూపంలో ఇవ్వడం జరిగింది మరియు కంటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి వాళ్లకి కంటి ఆపరేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగినది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది వారి లో కంటి సమస్యలు ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకొని వాళ్లకి ఈ గ్రామాలలో నిర్వహించే కంటి పరీక్ష వైద్య శిబిరం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం అని అదేవిధంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేసిన నారాయణపురం గ్రామ ప్రజలందరికీ కూడా మా డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఇకముందు కూడా కంటి వైద్య పరీక్షలతో పాటు మరిన్ని వైద్య పరీక్షల ఉచిత శిబిరాలు ఏర్పాటు చేస్తామని దీనిని గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ
కార్యక్రమంలో నారాయణపురం స్మార్ట్ పూర్ స్పోక్స్ పర్సన్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ నిర్వాహకులు చిలువేరు సైదులు, టిఆర్ఎస్వి చౌటుప్పల్ మండలం సోషల్ మీడియా కన్వీనర్ కానుకుర్తి శివకుమార్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గణం నరసింహ గారు స్మార్ట్ పూర్ ఫౌండేషన్ మేనేజర్ రాధిక గారు, కోఆర్డినేటర్ వంశీ గారు, లేజర్ కంటి ఆసుపత్రి డాక్టర్ నితీష్ నారాయణ నిర్వాహకులు శ్రీకాంత్, శరత్,సాయి, వాసు, రవికాంత్ చారి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL