Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే (South Central Railway).. ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది.
సికింద్రాబాద్ – మదురై (Secunderabad- Madurai) మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ద.మ.రైల్వే అధికారులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ – మదురై ప్రత్యేక రైలు (నెం.07191)ను ఆగస్టు 29 తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్తుంది.
అలాగే మదురై – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెం.07192)ను ఆగస్టు 31 తేదీ నుంచి సెప్టెంబర్ 28 తేదీ వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం మదురై నుంచి బయలుదేరి వెళ్తుంది.
సికింద్రాబాద్ – మదురై మధ్య ప్రత్యేక రైలు పొడగింపు..
అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సదరు వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.