B6 NEWS

 

భారతదేశంలో స్వేచ్చాయుతంగా జివిస్తున్నామంటే అంబేద్కర్ పుణ్యమే : పెరుమాల్ల ప్రమోద్ కుమార్

అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మునుగోడు : 73 వ భారత రాజ్యాంగ దినోత్సవము పురస్కరించుకొని మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్యాలను అందిస్తూ రూపొందించ బడిన రాజ్యాంగం 1949 నవంబర్ 26 న ఆమోదించబడింది అన్నారు.మన స్వతంత్ర భారత దేశములో అన్ని వర్గాలు స్వేచ్చాయుతంగా జీవిస్తున్నారంటే అందుకు మహనీయుడు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు . రాజ్యాంగానికి లోబడి అందరూ నడుచుకోవాలని ,రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు.మన దేశానికి దార్శనికుడు అయినటువంటి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అన్నారు . ఈ కార్యక్రమంలో సిర్గమల్ల రమేష్,దాసరి సాయి కుమార్, పెరుమాల్ల ప్రణయ్ కుమార్,బెల్లపు బాల శివ రాజు, పెరుమాల్ల రాము,గోలి భాను,నిరుడు రవివర్మ,గాలి జీవన్ , పెరుమాల్ల రాజీవ్,బెల్లపు ప్రసాద్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

FOLLOW B6 NEWS CHANNEL

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *