యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 132వ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది జ్యోతిరావు పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
మహాత్మ జ్యోతిబాపూలే బాలికల విద్య కోసం మహిళల హక్కుల కోసం మార్గదర్శకుడయ్యాడని అన్నారు అభాగ్యులైన పిల్లల కోసం మొట్టమొదటి హిందూ అనాధాశ్రమం స్థాపించిన ఘనత ఆయనకు దక్కిందని అన్నారు సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పూలే పని చేశారని అన్నారు బడుగు బలమైన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారిక కోసం కృషి చేసిన మహానీయుడు ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శమని
చెప్పవచ్చు అని అన్నారు
సామాజిక విప్లవ కారుడు..
ప్రజల చేత మహాత్మా అనీ కిర్తించబడ్డవాడు.
స్త్రీలకు చదువే వద్దన్న కాలంలో పెళ్ళైన మొదటి రాత్రే తన భార్యకు అక్షరాలు నేర్పించి చీకట్లో ఉన్న సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సూర్యుడు అన్నారు
మనిషిని మహోన్నతుడిగా తీర్చి దిద్దేది విద్యా ఒక్కటే అనీ నొక్కి చెప్పిన మహనీయుడు
మహాత్మా జ్యోతరావు
పూలే కొనియాడారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఘనం నరసింహ కురుమ బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు ఎర్రోళ్ల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణ ఏపూరి సతీష్ సిపిఐ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి చిలువేరు అంజయ్య సర్వేల్ మాజీ సర్పంచ్ ఈసం సోమేశ్వర్ కత్తుల నరసింహ ఉప్పల శీను పాలకూర సతీష్ మాధగోని బాలరాజ్ గౌడ్ ఉప్పల్ ఆంజనేయులు గుణగంటి రాజు ఈసా ఖాన్ సిలువేరు బుగ్గ రాములు రేవనపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు…
FOLLOW B6 NEWS CHANNEL