భూపాలపల్లి  జిల్లా

చిట్యాల మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గొర్రె శశికుమార్ హాజరై యువకుల్లో నిరుద్యోగులు పోరాడి బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది కానీ వాటి అమల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామంటు నోటిఫికేషన్ల జారీ చేసి దాదాపు సంవత్సరం అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం నియమకం జరగలేదు నియమకాల జాప్యం వల్ల నిరుద్యోగులు విద్యార్థులు కోచింగ్ సెంటర్లో ప్రైవేటు హాస్టల్లో ఫీజులు కట్టలేక తీవ్రమైన అవస్థలు పడుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జారీ చేసిన నోటిఫికేషన్. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి మొత్తం చెల్లించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల నోటిఫికేషన్లు జారీ చేసి జాప్తం చేయకుండా వాటిని నియమకాలను వెంటనే జరపాలని భారతీయ జనతా యువమోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది లేనున్న ఎడల రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాంప్రసాద్ మరియు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంపెల్లి మధుకర్ మండల నాయకులు కేంసారపు ప్రభాకర్ చింతకింది రామకృష్ణ సూత్రము నాగ వంశీ బుర్ర రాహుల్ జంజల కుమార్ తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *