మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మునిసిపాలిటీ 7వ వార్డులో గుంటి గూడెం లో గల స్మశానవాటికలో పర్యటించిన ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ లోని అన్ని కులాల వైకుంఠ ధమాలని సుందరికారణ చేసే క్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని అన్ని కులాలకు సంబంధించిన వైకుంఠ దామాలు అలహాధకారమైన వాతావరణం ఏర్పాటు చేసి చివరి మజిలీ ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి సహకారంతో నా సహా తోటి కౌన్సిలర్ల తో కలిసి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు సల్లూరి నర్సింగ్ , ఇంచార్జి AE నరేష్ , ఇరిగేషన్ AE పరమేష్ , వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ , తదితరులు పాల్గొన్నారు…..