రాష్ట్ర టిపిసిసి ఆదేశాల మేరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద తెలంగాణ రైతుల పక్షాన రైతు పోరుబాట* నిర్వహించారు. మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ రైతు పోరుబాటలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ , రైతు పోరుబాట సమన్వయకర్త సాబేర్ ఆలీ ,మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు భూపతిరెడ్డి , మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం లతో కలసి పాల్గొన్నారు .
ఈ సందర్బంగా హరివర్ధన్ రడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని ఒకే దఫాగా వెంటనే అమలు చేయాలని,ధరణి పోర్టల్ లో ఉన్న సాంకేతిక సమస్యలను గుర్తించి, తెలంగాణ రైతాంగం పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, ప్రస్తుత సీజన్లో పండిన ధాన్యాన్ని సరైన సమయంలో సేకరణ చేయాలని అన్నారు.తరుగు, తేమ శాతం పేరుతో దోపిడీకి గురవుతున్న రైతాంగాన్ని కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య నలిగిపోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలి రైతు బంధు డబ్బులు బ్యాంకులలో జమ అయిన వెంటనే బ్యాంకులు రైతుల ఎకౌంట్లు సీజ్ చేసి వారికి బ్యాంకుల్లో ఉన్న అప్పులకు జమ చేస్తున్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో ఆదేశాలు ఇచ్చి రైతుబంధు మొత్తాన్ని ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకుని రైతులను అప్పుల పాలు కాకుండా ,ఆత్మహత్యలకు ప్రేరేపించకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలని అన్నారు ,ఈ రైతు పోరుబాటలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏపీ బ్లాక్ అద్యక్షులు సింగరేణి పోచయ్యగ వేముల మహేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల, మున్సిపల్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు