B6 NEWS
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
– డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలపేల్లి బాలక్రిష్ణ
అమరవీరుల స్మారక భవనంలో డివైఎఫ్ఐ నారాయణపురం మండల కమిటీ కొత్త శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలపల్లి బాలక్రిష్ణ మాట్లాడుతూ, దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం దేశంలో నిరుద్యోగులకు, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు కేటాయించడం లేదని అన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సుర్వి కిరణ్, చెరుకు వెంకటేష్, వంగూరి సాయికిరణ్, గుండు నరసింహ, అంధోజు శివ శంకరాచారి తదితరులు పాల్గొన్నారు