అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

 

…మండల కేంద్రంలో బారి బైక్ ర్యాలీ

 

అంబేద్కర్ దేశానికి దిక్చూసి : సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు

 

నేటి యువత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఎస్సై దేవిరెడ్డి సతీష్ రెడ్డి

 

అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయం: పెరుమాల్ల ప్రమోద్ కుమార్

 

మునుగోడు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వర్ధంతి పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు,ఎస్సై సతీష్ రెడ్డి లు పాల్గొని సంఘం అధ్యక్షుడు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ ,సంఘం సభ్యులతో కలిసి చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం మండల కేంద్రములో జై బీమ్,అంబేద్కర్ కు జోహార్లు,అంబేద్కర్ ఆశయాలను సాధించాలని పెద్ద యెత్తున నినాదాలు చేస్తూ బారి బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ అంటరాని తనం వివక్షతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. మన దేశానికి దార్శనికుడు అయినటువంటి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అన్నారు.అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనియమన్నారు.నేటి యువత అంబేద్కర్ ను స్ఫూర్తి దాయకంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు… ఈ కార్యక్రమంలో పెరుమాల్ల కృష్ణయ్య, ముచ్చపోతుల శ్రీను,దాసరి సాయి కుమార్, ముచ్చపోతుల శ్రీకాంత్,ఇండ్ల నాగరాజు, రెడ్డిమళ్ళ యాదగిరి,సిర్గమళ్ళ రమేష్, పెరుమాల్ల ప్రణయ్ కుమార్,అద్దంకి వెంకటయ్య కరెంట్ ,బెల్లపు బాల శివ రాజు, పెరుమాల్ల ప్రతాప్, బోల్లు సైదులు, పెరుమాల్ల శ్రీరామ్,నిరుడు సైదులు,ముచ్చపోతుల సాయి నిఖిల్,గాలి జీవన్ , పెరుమాల్ల రాజీవ్,గోలి ప్రవీణ్,చింతపల్లి వంశీ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *