B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ కులాంతర వివాహల సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగినది ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు *యేలేటిఆంజనేయులు* మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకొని దంపతులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ నందు దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్న నూతన దంపతులకు ఆర్థిక సహాయం అందటం లేదు అన్నారు. కులాంతర వివాహం చేసుకున్న నూతన దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధికమించడం కోసం 50,000ఉన్న ప్రోత్సాహం 2,50,000పెంచమన్నారు కానీ ప్రోత్సాహం అందించడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విఫలం అయ్యాయి అన్నారు. గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ లో 4సంవత్సరాలనుండి బడ్జెట్ కేటాయించడం లేదు ఈ శాఖ లో ఉన్న అధికారులు బడ్జెట్ లేదు అనే నెపంతో వచ్చిన దరఖాస్తు లను ఎంక్వైరీ చెయ్యకుండా నిలిపి వెయ్యడం దారుణం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి కయినా స్పందించి డిసెంబర్ లో జరిగే సమావేశాలలో నయినా పెండింగ్ లో ఉన్న దరఖాస్తు లకు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించి కులాంతర వివాహం చేసుకున్న దంపతులను ఆడుకోవాలని డిమాండ్ చేశారు…
FOLLOW B6 NEWS CHANNEL