B6 NEWS
వికలాంగ దళితుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ ని శిక్షించాలి
బిఎస్పీ
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాజాకుంట గ్రామానికి చెందిన దళిత వికలాంగుడి పై అధికార టిఆర్ఎస్ అగ్రకుల సర్పంచ్ చెప్పుతో విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు శనివారం బిఎస్పీ ఆధ్వర్యంలో నార్కట్ పల్లి బస్ స్టాప్ దగ్గర ధర్నా నిర్వహించారు.అగ్రకుల అహంకారంతో ఓ దళిత వికలాంగుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ మీద కేస్ ఫైల్ అయిన ఇప్పటి వరకు సర్పంచ్ ని పోలీస్ స్టేషన్ పిలవకపోవడం విడ్డురామని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అదే సామాజిక వర్గానికి చెందిన అతను అయిన ఇప్పటి వరకు స్పందించకపోవడం దళిత ఎమ్మెల్యే దళితులకు మోసం చేస్తున్నారు అని బిఎస్పీ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి లు కట్ల జగన్నాధం గౌడ్,పుదరి నర్సింహ,అధిమల్ల గోవర్ధన్,జిల్లా అధ్యక్షుడు పుదరి సైదులు,జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్షిరం,ఈసీ మెంబెర్ గ్యారా మారయ్య,జిల్లా మహిళ కన్వీనర్ పోకల ఎల్జీబిత్, జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్,నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి,నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్,నియోజకవర్గ ఉపాదక్షులు పావిరాల నర్సింహ యాదవ్,కట్టంగూర్ మండల అధ్యక్షులు ఇంద్రకంటి లవకుమార్,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత,రామన్నపేట మండక అధ్యక్షుడు మేడి సంతోష్,నార్కట్ పల్లి నాయకులు చిరుమర్తి సైదులు,చింత లక్ష్మణ్, మేడి వాసుదేవ్,బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
FOLLOW B6 NEWS