B6 NEWS
కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బిఎస్పీ నాయకులు మాట్లాడుతూ నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామ సర్పంచ్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రియదర్శిని మేడి డిమాండ్
చేశారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే రిమాండ్ కు తరలించాలి అని డిమాండ్ చేశారు. ఒకవైపు దళిత బంధు మరొకవైపు దళితులపై దాడులు సిగ్గు చేటన్నారు. దళిత ముఖ్యమంత్రి నినాదం ఈ దశాబ్దపు ఘరానా మోసం అన్నారు. దళిత బంధు ఈ దశాబ్దపు ఘరానా మోసం అన్నారు. ఒక వైపు దళిత బంధు ఇస్తూ మరొకవైపు దళితులపై దాడులు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వన్ని గద్దెదించాలన్నారు. దాడి చేసిన సర్పంచ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా ఇన్చార్జిలు పోదరి నరసింహ ఆదిమల్ల గోవర్ధన్ మహిళ జోనల్ కన్వీనర్ ఇంద్రవెల్లి కవిత నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ అంకెపాక శ్రీను, అధ్యక్షులు గద్దపాటి రమేష్,శివరామ కృష్ణ నాయకులు చేరుకుపల్లి శాంతి కుమార్,మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.