B6 NEWS
కెసిఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ముంబై వలస కూలీల బ్రతుకులు:
తెలంగాణ వస్తే వలసలు ఉండవని చెప్పిన కేసీఆర్ ని నమ్మి, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ముంబై వలస కూలీలు ఆవేదనకు గురయ్యారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు జిల్లా ఇన్చార్జ్ కొండమడుగు రాజు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందోజు శంకరాచారి, ఏర్పుల అర్జున్ లతో కూడిన సభ్యుల బృందం ముంబై ను మూడు రోజుల పర్యటన చేసింది. అక్కడ వలస కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ముంబైకి దాదాపు 5 లక్షల మంది వలసకు వెళ్ళినట్టుగా అక్కడి కూలీలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం నుండి దాదాపు 20,000 మంది అక్కడ వలస కూలీలుగా జీవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ వలస కూలీలు 180 సంఘాలుగా ఏర్పడి 280 కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమ నుండి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తమ గోడు వినలేదని వారు వాపోయారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లేసే యంత్రాలుగా మమ్మల్ని వాడుకుంటున్నారని అన్ని పార్టీల నాయకులను వారి ప్రవర్తనను వారి తీరును దుయ్యబట్టారు. ముంబై వలస కార్మికులు ప్రధానంగా ఈ రాజకీయ నాయకులు కోరుతున్న సమస్యలు.
1. వలస కార్మికుల పిల్లలకు స్థానికత మీద వచ్చే విధంగా లోకల్ నాన్ లోకల్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలి
2. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు వలస కార్మికులకు ఇవ్వాలని డిమాండ్
3. మునుగోడు నియోజకవర్గం నుండి వలస కార్మికులను తిరిగి రప్పించి ఇక్కడి కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వాలి లేదా వారికి వలస బందును ప్రకటించాలి.
4. గతంలో నార్కట్పల్లి నుండి ముంబైకి ప్రతిరోజు నడిచిన బస్సులు వెంటనే పునరుద్ధరించి స్లీపర్ బస్సును నడపాలని డిమాండ్ చేస్తున్నాము
5 వలస కార్మికుల సౌకర్యార్థం ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ ను రైలును భువనగిరిలో ఆపాలని డిమాండ్ చేస్తున్నాము
ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ముంబై వలస కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించినట్లయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ అందోజు శంకరాచారి డిమాండ్.
ఈ సమావేశంలో భువనగిరి జిల్లా ఇంచార్జ్ కొండమడుగు రాజు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బుట్ట శివ, కోశాధికారి కత్తుల పరమేష్, మహిళా కన్వీనర్ పద్మ యాదవ్, మస్కు నరసింహ, దోనూరి కృష్ణారెడ్డి, మరి కూడా మండల అధ్యక్షుడు గిరి నరసింహ, కాకుమాను సత్యనారాయణ, గడ్డం కృష్ణ, కత్తుల నరసింహ, మహేష్ రాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL