మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని నల్ల బ్యాడ్జితో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులసమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నబి ఆధ్వర్యంలో మొగుళ్ళపల్లి హై స్కూల్ లో మధ్యాహ్న భోజన కార్మికులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు…… ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నబి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం 1000 రూపాయలు మాత్రమే అందిస్తూ శ్రమ దోపిడి కి గురి చేస్తున్నారన్నారు….2022 మార్చిలో నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ 3000/- గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం జరిగిందని కానీ ఇంతవరకు అమలు కాలేదన్నారు… అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటుకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచాలన్నారు…. అదేవిధంగా కోడిగ్రుడ్లని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలనీ, గ్యాస్ పోయిలు ఇవ్వాలని మరియు ప్రతి స్కూల్ లో నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసారు…. ఈ సమస్యలపై జనవరి 3న జిల్లా కలెక్టరేట్ ముట్టడి మరియు జనవరి 18 న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంటుందని దాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు…. ఈ కార్యక్రమంలో, మధ్యాహ్న భోజన వంట కార్మికులు నీరటి రాజమ్మ అన్నారపు భద్రమ్మ పాల్గొన్నారు.