హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. ఈయన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది.

‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం.. కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గించారు. ఈయన నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ‘జిన్నా’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ డేట్‌ను ప్రకటించారు.

‘జిన్నా’ టీజర్ ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్‌ను తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. సన్నిలియోన్‌, రాజ్‌పుత్‌పాయల్ ఈ సినిమాలో భాగమవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.