RTI ఆక్టివిస్ట్ చెరుకు శివ గౌడ్ RDO గారికి వినతిపత్రం అందజేశారు…
పట్టణ ప్రగతిలో మరియు సామాజిక కార్యక్రమాలలో భాగంగా చౌటుప్పల్ మండలంలో వివిధ మొక్కలతో పాటుగా కోనో కార్పస్ చెట్లను నాటడం జరిగింది.అయితే గత కొద్ది కాలంగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ఫలితంగా కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమైనవని వీటివలన శ్వాసకోత ఇబ్బందులు,ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిర్ధారణ జరిగింది. వివిధ మండలాలలో వీటిని తొలగించడం జరిగింది. కానీ చౌటుప్పల్ మండల కేంద్రంలో కోనో కార్పస్ మొక్కల తొలగింపు చర్యలు చేపట్టనే లేదు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటి స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలను నాటాలని చెరుకు శివ గౌడ్ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.