B6 NEWS

సిపిఎం ప్రజా ఉద్యమాలకు తోడ్పాటును అందించండి:-Md.జహంగీర్ CPM పార్టీ జిల్లా కార్యదర్శి.

 

ధరల పెరుగుదల, మతోన్మాదం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సిపిఎం ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందని, ఈ ప్రజా ఉద్యమాల నిర్వహణకు ప్రజలందరి సహకారం కావాలని ప్రజలు తోడ్పాటును అందించి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి Md. జహంగీర్ ప్రజలను కోరారు.

ఈరోజు భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఇంటింటికి సిపిఎం మెగా క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి Md. జహంగీర్ మాట్లాడుతూ ఈరోజు ,రేపు రెండు రోజులపాటు భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటికి సిపిఎం మెగా క్యాంపియన్ నిర్వహిస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సిపిఎం అనేక ప్రజా ఉద్యమాల నిర్వహిస్తుందని జిల్లా ఏర్పడిన ఏడేండ్ల కాలంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ,సాగు – త్రాగునీరు సాధన కోసం, వ్యవసాయ కూలీ, రైతంగ సమస్యలు, మహిళా, కార్మిక హక్కుల రక్షణ కోసం, విద్యా, వైద్యం ,ఉపాధి సదుపాయాలతో పాటు, సామాజిక న్యాయం, వృత్తిరక్షణ, మూసి ప్రక్షాళన ,భూ నిర్వాసితుల సమస్యలపై ఉవ్వెత్తిన ఉద్యమాలు జరిపామన్నారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పాలకులు అనేక వాగ్దానాలతో అందలమెక్కారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని అన్నారు. జిల్లాలో నత్తనడకలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్ పనులు, పాలమూరు,, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు అతిగతి లేని గంధమల్ల రిజర్వాయర్, అసంపూర్తిగా ఉన్న పునాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ ,ధర్మారెడ్డి పల్లి కాలువలో మోసి ప్రక్షాళన ,వివిధ కాలువలను గోదావరి జలాలకు అనుసంధానం, అరకోర వసతులతో ఉన్న ఎయిమ్స్, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ,చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజ్ , ఆలేరులో ఆర్డీవో కేంద్రం, భూనిర్వాసితుల సమస్యలు ,రామన్నపేట– భువనగిరి నాలుగు లైన్ల రోడ్డు, ఇండ్లు ,ఇంటి స్థలాలు, పెన్షన్లు, ప్రాణాలను హరిస్తున్న కాలుష్యం ఇలా అనేక సమస్యలు జిల్లాల్లో ఉన్నాయన్నారు. ఈరోజు ,రేపు రెండు రోజులపాటు భూమి పట్టణ కేంద్రంలో ఇంటింటికి సిపిఎం మెగా క్యాంపియన్ కార్యక్రమంలో అధ్యయనం చేసిన సమస్యలపై మార్చి — ఏప్రిల్ మాసంలో ప్రజా పోరాటాలకు సిపిఎం సిద్ధమవుతుందన్నారు.

 ఈ పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉద్యమ నిర్వహణకు ఆర్థికంగా సహకరించాలని జహంగీర్ గారు కోరారు. ఈ మెగా క్యాంపన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కల్లూరు మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, పైల లింగారెడ్డి, మాయ కృష్ణ ,దయ్యాల నరసింహ, సిర్పంగి స్వామి ,గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి రేకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, బండారు శ్రీరాములు, పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, బోడభాగ్య, మంచాల మధు, కోట రామచంద్రారెడ్డి, గాడి శ్రీనివాస్, తీగల వెంకటేష్, దొడ్డి బిక్షపతి ,గంధ మల్ల మాతయ్య, పల్లెర్ల అంజయ్య, కొండ అశోకు ,కొండాపురం యాదగిరి ,బందెల ఎల్లయ్య, కూకుట్ల కృష్ణ, వడ్డెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW B6 NEWS CHANNEL

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *