ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో స్నేహాలు, ప్రేమలు, లివింగ్‌ రిలేషన్‌షిప్‌, వ్యక్తిగత సంబంధాలపై అనేక వార్తలు, గుసగుసలు చక్కర్లు కొడుతూ ఉంటాయి.

స్టార్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌-ఛార్మి విషయంలోనూ ఇలాంటి వార్తలు సోషల్‌మీడియాలో కుప్పలు తెప్పలు. అయితే, ఎప్పుడూ వారిద్దరూ దీనిపై స్పందించలేదు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై పూరి తనదైన శైలిలో స్పందించారు.

విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ ‘లైగర్‌’ (Liger). అనన్య పాండే కథానాయిక. ఛార్మి (Charmme) నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ”ఆమె 50ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ, ఆమె (ఛార్మి) యంగ్‌ ఏజ్‌లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జనమంతా అనుకుంటున్నారు. ప్రతి జంటకూ ఓ రొమాంటిక్‌ యాంగిల్‌, శృంగార ఆకర్షణ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఈ అమ్మాయి(ఛార్మి) 13ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు” అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్‌ గురించి పూరి జగన్నాథ్‌ ఆసక్తికరంగా జవాబిచ్చారు.

ఇక ‘లైగర్‌’ గురించి మాట్లాడుతూ.. స్వతహాగా తాను రైటర్‌నని, పదేళ్ల కిందటే ‘లైగర్‌’కథ రాశానని చెప్పారు. ఈ ఆలోచన విజయ్‌కు చెప్పినప్పుడు తను చాలా ఉత్సాహం చూపించాడని అన్నారు. అతనికి రెండు కథలు చెబితే, ‘నాకు లైగర్‌ కథ నచ్చింది. నా శరీరాన్ని దృఢంగా చేసుకుంటా. ఫైటర్‌లా మారతా. ఈ సినిమా చేయండి’ అని అన్నాడని పూరి తెలిపారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘లైగర్‌’ నిర్మిస్తున్నారు. మైక్‌టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లైగర్‌’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *