జర్నలిస్టులపై మోపిన అక్రమ కేసును రద్దు చేయాలి
టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో డిసిపికి వినతి
కులం పేరుతో దూషించారని జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసును రద్దు చేయాలని ఆదివారం భువనగిరి జోన్ డిసిపి రాజేష్ చంద్ర గారిని కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా టియూడబ్ల్యూజే (హెచ్ -143)కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామ రెవెన్యూ శివారులో ఈనెల 22న కరెంటు షాక్ తో ఇటుక బట్టిలో ఒరిస్సా కార్మికుడు మృతి చెందగా భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురాగా విషయం తెలుసుకున్న భువనగిరి రిపోర్టర్లు న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి వీడియో చిత్రీకరణ చేస్తుండగా బొమ్మలరామారం మండలం లక్ష్మీ తండ గ్రామానికి చెందిన ధీరావత్ రాజన్ నాయక్ వీడియో తీయకుండా అడ్డుకోవడంతోపాటు తీవ్ర పరుష పదజాలంతో దూషించిన విషయమై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. ఈ కేసు రాజీ పడాలని విలేకరులపై రాజన్ నాయక్ అతని వర్గీయులు ఒత్తిడి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దురుద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషించారని ఈ ఘటనలో సంబంధం లేని రిపోర్టర్ల పేర్లను సైతం జోడించి ఐదుగురిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ ఘటనపై పూర్వపరాలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని జర్నలిస్టులు కోరారు. జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తి పై డిసిపి సానుకూలంగా స్పందించారు. వినతి పత్రం అందజేసిన వారిలో టియుడబ్ల్యూజే హెచ్ 143 యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ, ఐజేయు జాతీయ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాసరావు, దాత్రక్ దయాకర్, యూనియన్ జిల్లా నాయకులు కేతవత్ తిరుపతి నాయక్, బానోతు చక్రు నాయక్, చిన్న బత్తిని మత్యాస్, ఎం.డి ఇస్తియాక్, కుర్మిండ్ల రాజు గౌడ్, బొడిగే దిలీప్ కుమార్, బండారు జగదీష్, బుగ్గ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిద్దుల శివకుమార్, బొల్లెపల్లి కిషన్, గడసందుల నాగరాజు, ఎం.డి ఇంతియాజ్, ఇస్సాక్, పల్లెర్ల కుమార్* తదితరులు పాల్గొన్నారు.