B6 NEWS
డిగ్రీ ఫలితాలలో మరోసారి మాతృశ్రీ ప్రభంజనం
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలలో వనం శివాని( బి.కామ్) మూడవ సెమిస్టర్ లో 10/10 SGPA సాధించింది. అదే విధంగా 30 మందికి పైగా విద్యార్థులు 9:00 SGPA సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జి. శ్రీనివాస్ విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో గత 17 సంవత్సరాలుగా మాతృశ్రీ డిగ్రీ కళాశాల ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాదించిందని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వింటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. మహేందర్రెడ్డి, మరియు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL ✉️