మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో సైన్స్ డే
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ పరిధిలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో సైన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.మహేందర్ రెడ్డి గారు సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ బి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థిని విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని, పరిశోధనల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.