B6 NEWS 

అనాధలకు అండగా ఉంటాం: -తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ

మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలం సర్వేలు మేజర్ గ్రామపంచాయతీలో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా ఉన్న గాదెపాక తేజ, గాదపాక కృష్ణవేణి లకు వారి జీవనాన్ని కొనసాగించుటకు ఆర్థిక సాయంగా పదివేల పదారు రూపాయలను 10016/-ఆర్థిక సహాయాన్ని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ గారు మాట్లాడుతూ మా మునుగోడు నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా సర్వేల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి సాయం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా తల్లిదండ్రులు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్లకు మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి అండగా ఉంటామని తెలియజేశారు ఈ యొక్క వార్తని పత్రికల ద్వారా సమాజానికి తెలియజేసిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు అన్నారు అదేవిధంగా అనాధల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వారికి ఉద్యోగాన్ని కల్పించిన కలెక్టర్ గారికి అభినందనలు అన్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు న్యాయపరమైన సలహాలు అందజేస్తూ అదేవిధంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాధలను ఆదుకోవడానికి ఎల్లవేళల ముందు ఉంటామని ప్రముఖ హైకోర్టు న్యాయవాది సామాజికవేత్త నర్రి స్వామి కుర్మ గారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రమేష్ యాదవ్ మాట్లాడుతూ నా తల్లిదండ్రులను కోల్పోయిన సందర్భంగా నేను పడినటువంటి బాధలు తెలుసు కాబట్టి మా తెలంగాణ సామాజిక చైతన్యవేదిక తరపున అనాధలు అయినటువంటి పిల్లలకు ఆర్థిక సహాయం అందజేయడం మా సంస్థ యొక్క అదృష్టం అన్నారు ఈ కార్యక్రమంలో లాయర్స్ ఫోరంపర్ సోషల్ జస్టిస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యదర్శి బాలకృష్ణ , తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మండల నాయకులు పబ్బతి యాదయ్య నరసింహారావు,గ్రామ నాయకులు గుండె రాజేష్, సిద్ధ గొని సాయి కట్టెల వీరస్వామి సింగపంగా విష్ణు తదితరులు పాల్గొన్నారు…

FOLLOW B6 NEWS CHANNEL ✉️

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *