యాదాద్రి భువనగిరి జిల్లా.. ఆత్మకూరు(m). ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కారణంగా మండలంలో పలు గ్రామాలలో వరిచేలు,కూరగాయలు, మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరిగిందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి గారు అన్నారు.మండలంలోని పలు గ్రామాలలో పంటచెలను పరిశీలించారు. గ్రామలలో నష్టం వాటిల్లిన పంటలను గుర్తించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, చెల్లించే నష్ట పరిహారంలో జాప్యం లేకుండా త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి, మండల OBC మోర్చ అద్యక్షులు బండి ఉప్పలయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.