కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియాకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఉలెన్‌బాటర్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ బీ మ్యాచ్‌లో పాలస్తీనా 4-0తో ఫిలిప్పిన్స్‌ను ఓడించడంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారు అయ్యింది.
తాజా ఫలితంతో గ్రూప్ బి టాపర్‌గా పాలస్తీనా నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచిన ఫిలిప్పిన్స్ ఇంటి ముఖం పట్టింది.
ఓవరాల్‌గా ఆసియాకప్‌కు భారత్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 1964, 1984, 2011, 2019లో అర్హత సాధించింది. అయితే 2019 టోర్నీలో గ్రూప్ దశలోనే వైదొలిగింది. మొత్తం 24 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్‌ను మూడు ప్రదేశాల్లో నిర్వహించారు. ఇందులో గ్రూప్ డి మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది.
హాంకాంగ్‌ను చిత్తు చేసిన భారత్ 9 పాయింట్లతో గ్రూప్-డి టాపర్‌గా ముందంజ వేసింది. అన్వర్ అలీ (2వ), సునీల్ ఛెత్రి (45వ), మన్వీర్ సింగ్ (85వ), (90+3వ) ఇషాన్ భారత్ తరఫున గోల్స్ కొట్టారు. భారత్ వరుసగా రెండోసారి ఆసియాకప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి.
2019లో కూడా ఆ జట్టు ఆసియాకప్‌లో ఆడింది. అర్హత పోటీల్లో ఆరు గ్రూపుల విజేతలు, అయిదు అత్యుత్తమ రన్నరప్ జట్లకు ఫైనల్స్‌లో చోటు దక్కుతుంది. పాలస్తీనా గ్రూప్-బి విజేతగా ముందంజ వేసింది. క్వాలిఫయర్స్‌లో భారత్ తన తొలి రెండు మ్యాచ్‌ల్లో కాంబోడియా, అఫ్గానిస్థాన్‌లపై గెలిచింది.