నిరుపేదలకు అండగా నిలిచిన మాతృదేవోభవ పితృదేవోభవసంస్థ
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం ఇందిరానగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలకృష్ణ గారు ఇటువలే చనిపోయారు వారి దశదిన సందర్భంగా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం మరియు 10 రకాల కూరగాయలు ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో సంస్థ సలహాదారులు తొంటా నరేందర్ మాట్లాడుతూ పేదల కొరకు ఏర్పడ్డ మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఎంతో మందికి సాయం చేసుకుంటా రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బాలకృష్ణ కుటుంబానికి సహాయం చేసాము భవిష్యత్తులో కూడా నిరుపేద కుటుంబాలకు మా సంస్థ ఇప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు అలానే సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కురుమేటి నవీన్,సంస్థ సభ్యులు మహేష్,ప్రభు, గ్రామస్తులు సురేష్,మురళి,నరేష్, సోమ నరసయ్య,మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు