అధికార పార్టీ అండదండలతో అక్రమ పట్టా చేసుకొన్న మాజీ ఎంపీపీ బందెల స్నేహలత నరేష్
అక్రమ పట్టా చేసుకున్న బందెల స్నేహాలత పాటు రామకృష్ణపూర్ (T) వీఆర్ఏ దండెం సందీప్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోండి
ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామకృష్ణాపూర్(టి) గ్రామంలోని ఎస్సీ కాలనీ మూడో వార్డు మాలకులస్తులతో కలిసి మీడియా మిత్రులతో మాట్లాడిన మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.
గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో నివాసం ఉంటూ కాలనీ ఏర్పాటు చేసుకుని కాలనీవాసులకు 370/cసర్వే నంబర్ లో 3 ఎకరాల 24 గంటల భూమి కాలనీవాసుల పేరు మీద ఉండేది.దానిని 2019 సంవత్సరంలో మాజీ ఎంపీపీ బందెల స్నేహలత.నరసయ్య పేరుమీద అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపిస్తూ కాలనీవాసులు సుమారు 20 కుటుంబాలు ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి స్థానిక తహసిల్దారు గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన దానిమీద సరియైన విచారణ చేయక.స్థానికంగా గత 35 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న లబ్ధిదారులకు తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలని ఈరోజు ఆ కాలనీవాసులు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది.అక్రమ పట్ట చేసుకుని లబ్ధిదారులకు చెందవలసిన ప్రభుత్వ ఫలాలు అందకుండా అక్రమాలు పట్టాదారులు లబ్ధి చెందుతున్నారు.ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న Vra దండం సందీప్ బందు ప్రీతితో బందేల స్నేహలత నరేష్ వాళ్ళ మేనల్లుడు రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని విధుల దుర్వినియోగం చేస్తూ అక్రమ పట్టా చేపియడం జరిగిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కావున రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇట్టి విషయంపై విచారణ చేపట్టి వీఆర్ఏను సస్పెండ్ చేస్తూ కాలనీవాసులకు న్యాయం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.లేనియెడల అధికార పార్టీ నాయకుల మాటలకు తలోగ్గి కాలనీవాసులకు అన్యాయం చేయాలని అధికారులు చూస్తే మాత్రం కాలనీవాసుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే అధికారులు స్పందించి కాలనీవాసులకు ఉండవలసిన 3.24 గంటల భూమి కాలనీవాసుల భూమి కాలనీ పేరు మీద రికార్డులకు వచ్చే విధంగా చూడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూన్నాం ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బండ శ్రీకాంత్.పొన్నం సాంబయ్య.మాడుగుల వీరయ్య.వైయినాల యశ్వంత్, నునేటి రమేష్ తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు*