B6 NEWS
మునుగోడులో జరిగే ప్రజాదివేన సభ కు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి (*భారత విద్యార్థి పెడరేషన్ -SFI*) వివరిస్తూ చౌటుప్పల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత 7సంవత్సరాల క్రితం మీకు SFI ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది.మునుగోడు నియోజకవర్గం సెంటర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబుర్స్మెంట్,స్కాలర్షిప్ విడుదల చేయాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం…
మును”గోడు” తీర్చాలని కేసీఆర్ గారిని కోరుతున్నాం.మునుగోడు లో ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉంది.ఫ్లోరైడ్ తో చాలా మంది కిడ్నీ మరియు మోకాళ్ళ నొప్పులు మరియు అనేక వ్యాధులతో ఈ మునుగోడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.కావున ఈ ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.మునుగోడు ప్రాతం అన్ని విధాలుగా వెనుకబడిన ప్రాంతం గా ఉంది రోడ్డు సమస్యలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.మునుగోడు నియోజక వర్గంలో మండలానికి ఒక జూనియర్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూన్నాం.గట్టుప్పల్ మరియు పుట్టపాక గ్రామల మధ్యలో ఏర్పాటు చేస్తున్న పార్మ కంపెనీ ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా ముచ్చర్ల లో ఫార్మా సిటీ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.