యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు బస్టాండ్ నుండి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు సర్వీస్ రోడ్లపై రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల నుండి మార్పు మొదలు కావాలని, ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి గెలిస్తే ఉచిత విద్య వైద్యం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని అన్నారు. ఇప్పుడున్న నాయకులు ప్రాంతాలను విడదీస్తూ కులమత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా మంచోడని ఈసారి ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని, ప్రజాశాంతి పార్టీకి అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. నేనే వాళ్లకి వెలమ బందు, రెడ్డి బంధు ఇచ్చానని వాళ్లు మనకి బందులు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు.